- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం
కూటమి ప్రభుత్వ పాలనలో పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వ పాలనలో పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) అన్నారు. సంతమాగులూరు మండలంలోని పుట్టావారి పాలెంలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల (CMRF Cheque Distribution) పంపిణీని ఆయన మంగళవారం నిర్వహించారు.
సుమారు 47 మంది లబ్ధిదారులు పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ వారందరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు, ఎల్ఓసీ పత్రాలను కూడా అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదవారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వారి ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తోందన్నారు.
అర్హులైన ప్రతిఒక్కరికి అండగా నిలవాలనే స్పష్టమైన సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ఆర్థిక స్థితిని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నవారికి స్వయంగా ప్రభుత్వం సహాయం చేస్తోందన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి ఆర్థిక సాయం అందిస్తోందని వివరించారు.
అర్హులైన ఎంతో మందికి ఇప్పటికే కోట్లాది రూపాయలు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు. తద్వారా పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యం చేయించుకునేందుకు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత వైసీపీ పాలనలో పేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. వారి ఆరోగ్య సంరక్షణ విషయాన్ని వైసీపీ పాలకులు గాలికి వదిలేశారని విమర్శించారు.
కానీ కూటమి ప్రభుత్వం అలా కాదని స్పష్టం చేశారు. పేదలకు అవసరమైన వైద్య సహాయం అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. అదే దిశగా నిరంతరం పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.






