తీరనున్న ఆంధ్రా ప్రజల కష్టాలు.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

by Kema Shiva Kumar |

ఎట్టకేలకు ఆంధ్రా ప్రజల కష్టాలు తీరనున్నాయి.

తీరనున్న ఆంధ్రా ప్రజల కష్టాలు.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు ఆంధ్రా ప్రజల కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్ (Basavatarakam Indo American Cancer Hospital), రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌.. రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ (Cancer Care Center)ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇవాళ తుళ్లూరు-అనంతవరం గ్రామల మధ్య బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యే, బసవ తారకం ట్రస్టు సభ్యులు హాజరయ్యారు.

కాగా, బసవతారకం క్యాన్సర్‌ కేర్‌ క్యాంపస్‌ నిర్మాణానికి ఇప్పటికే CRDA 21 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో సమగ్ర క్యాన్సర్‌ చికిత్స, పరిశోధనలతో పాటు రోగుల సంరక్షణకు ఎక్స్‌లెన్సీ సెంటర్‌ (Center of Excellence)‌ను ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో 500 పడకల సామర్థ్యంతో ఆంకాలజీ విభాగానికి సంబంధించి సేవలను ప్రారంభిస్తారు. ఇక రూ.750 కోట్లతో క్యాన్సర్ కేసు క్యాంపస్‌లో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలను సమకూర్చనున్నారు.. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్‌ కేర్‌ సెంటర్ ఏర్పాటు చేసి 2028 నాటికి సర్జరీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Next Story