- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు పాటకు అమరత్వాన్ని ప్రసాదించిన మహనీయులు : సీఎం
ప్రముఖ సీని నేపథ్య గాయకులు ఘంటసాల (Ghantasala) వెంకటేశ్వర రావు జయంతిని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఆయనను స్మరించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సీని నేపథ్య గాయకులు ఘంటసాల (Ghantasala) వెంకటేశ్వర రావు జయంతిని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఆయనను స్మరించుకున్నారు. ఎక్స్ వేదికగా ఘంటసాలకు నివాళులు అర్పించారు. తన ఎక్స్ ఖాతాలో సీఎం చంద్రబాబు నాయుడు పోస్ట్ చేస్తూ "తెలుగు పాటకు అమరత్వాన్ని ప్రసాదించిన ఘంటసాల వెంకటేశ్వరరావుగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఆయన కేవలం సినీ నేపథ్య గాయకుడు మాత్రమే కాదు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లిన దేశభక్తుడు. తెలుగు రాష్ట్ర సాధన కోసం సైతం తన గానంతో ఉద్యమానికి ఊపిరినిచ్చిన తెలుగు వెలుగు ఘంటసాల మాస్టారి కళాసేవను, దేశ సేవను ఈ సందర్భంగా స్మరించుకుందాం." అన్నారు.
ఘంటసాల వెంకటేశ్వర రావు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకులు. తన గాత్రంలో ప్రపంచ నలుమూలలా అభిమానులను సంపాదించుకున్నారు. వినసొంపుగా రాగాలను పలికించడంలోనే కాదు భావత్మాకతను కూడా తన గాత్రంలో ప్రతిబింబించిన మహనీయులు. ఘంటసాల వెంకటేశ్వర రావు 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. వీరి వంశ జన్మ స్థలం కృష్ణా జిల్లాలోనే ఉన్న ఘంటసాల గ్రామం. అక్కడి నుంచే వారు చౌటపల్లికి వలస వెళ్ళారు. నేటికీ వారి వంశీకులు ఘంటసాల గ్రామంలో ఆలయ పూజారులుగా ఉన్నారు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. అతను ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవారు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అతన్ని బాల భరతుడు అని పిలిచేవారు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరంతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డారు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందినది.






