Ap News: రికార్డులకెక్కిన ఆవిష్కరణ ‘ఆంధ్ర’ కార్యక్రమం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-20 08:49:15  IST  )

ప్రభుత్వం చేపట్టిన ఆవిష్కరణ ‘ఆంధ్ర’ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది....

Ap News: రికార్డులకెక్కిన ఆవిష్కరణ ‘ఆంధ్ర’ కార్యక్రమం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆవిష్కరణ ‘ఆంధ్ర’ కార్యక్రమం(Innovation ‘Andhra’ program) గిన్నిస్ రికార్డు(Guinness record)సాధించింది. దీంతో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), మంత్రులను గిన్నిస్ బుక్ ప్రతినిధులు కలిశారు. గిన్నిస్ రికార్డు సరిఫికెట్‌ను అందజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆన్ లైన్‌లో 24 గంటల్లో అత్యధికంగా పారిశ్రామిక వేత్తలు పేర్లు నమోదు కావడంతో ఈ కార్యక్రమం గిన్నిస్ రికిర్డుకెక్కింది. 1.67లక్షల

కాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రభుత్వం ఆవిష్కరణ ‘ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో వివిధ చోట్ల హబ్‌లను ఏర్పాటు చేయడం, స్టార్టప్ కంపెనీలను నెలకొల్పడం, పెట్టుబడులను ఆహ్వానించడం, పెట్టుబడులకు ముందుకొచ్చిన కంపెనీలకు ప్రోత్సాహాలు ఇవ్వడం, కుటుంబానికో పారిశ్రామికవేత్త, రాష్ట్రవ్యాప్తంగా గ్రిడ్లు ఏర్పాటు వంటి అంశాలతో ఆవిష్కరణ ‘ఆంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుపతి, మంగళగిరి, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుపతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్‌ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మంగళగిరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా హబ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. తాజాగా సీఎం చంద్రబాబును కలిసి గిన్నిస్ రికార్డును అందజేశారు.

Next Story