- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యం! ఏపీ సీఎం చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలతో.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితులలో ప్రజల ప్రాణలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలతో.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితులలో ప్రజల ప్రాణలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. వరదల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో ఆయన అత్యవసవర సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. జగ్గయ్యపేటలోని కాజా టోల్ గేట్ వద్ద ముంపు ఎక్కువగా ఉందన్నారు. విజయవాడ, గుంటూర్ లో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణ విషయమని, అందువల్లే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని అన్నారు. గుంటూర్, విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. వరదల వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. కొండచరియాలు విరిగిపడటం, వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. అయితే పులిచింతల నుంచి ఎక్కువ వరద ప్రవాహం కొనసాగుతుందని, ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని, బ్యారేజి కింద పలుచోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయని అన్నారు. బుడమేరు వల్ల వీటీపీఎస్ లో విద్యుదుత్పత్తి ఆగిందని తెలిపారు. వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టి, 17 వేల మందిని తరలించామని చంద్రబాబు అన్నారు. ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టామని, సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వరద ప్రాంతాల్లోని ప్రజలకు 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వెల్లడించారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడతాం. ప్రజల ప్రాణాలను కాపాడటమే మా తక్షణ కర్తవ్యమని చంద్రబాబు అన్నారు.






