ఆ డెయిరీ నుంచే పాల సరఫరా.. రాజమండ్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్

by Vemula.Srinu Prasad |

రాజమండ్రి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నరసాపురం వరలక్ష్మి డెయిరీ నుంచి పాల సరఫరా చేసినట్లు గుర్తించింది..

ఆ డెయిరీ నుంచే పాల సరఫరా.. రాజమండ్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి ఘటన(Rajahmundry)ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నరసాపురం వరలక్ష్మి డెయిరీ(Narasapuram Varalakshmi Dairy) నుంచి పాల సరఫరా చేసినట్లు గుర్తించింది. పాల నమూనా(Milk sample)లను హైదరాబాద్‌(Hyderabad)కు పంపింది. కల్తీ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పు పరిహారం ప్రకటించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 12 మందికి చికిత్స అందిస్తోంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం స్పందించింది.

Next Story