- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి.. మాజీ సీఎం జగన్ విజ్ఞప్తి

దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక రోడ్డు ప్రమాదం(Road Accident)లో వేద విద్యార్దులు(Students) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక(Karnataka)లోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తో పాటు వేద విద్యార్దుల(Students) మృతి పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వైఎస్ జగన్ కీలక విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ క్రమంలో ‘‘కర్నూలు జిల్లా మంత్రాలయం(Mantralayam) నుంచి కర్ణాటకలోని హంపీ(Hampi) ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా.. వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం(Government) అండగా నిలబడాలని కోరుతున్నాను’’ వైఎస్ జగన్ పేర్కొన్నారు.