యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్‌.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-11 17:34:18  IST  )

ఏపీలో యూనివర్సిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది..

యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్‌.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో యూనివర్సిటీ(University)లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. యూనివర్సిటీలో విద్యార్థులు, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Education Minister Nara Lokesh) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్‌ లేకుండా పోయాయని చెప్పారు. గతంలో యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా పని చేసిన ప్రసాద్‌ జగన్‌కు కార్యకర్తగా పనిచేశారని ఆరోపించారు.

మాజీమంత్రి పెద్దిరెడ్డి బంధువైన ఓ వీసీ ఏకంగా యూనివర్సిటీలో వైఎస్‌ఆర్‌ విగ్రహమే పెట్టారని లోకేశ్ మండిపడ్డారు. పుస్తకాలపై రాజకీయ నేతల ఫొటోలు లేకుండా చేస్తామని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను కూడా జగన్ సొంత ప్రచారానికి వాడుకున్నారని గుర్తు చేశారు. విద్యార్థులకు అందించే పుస్తకాలు, బెల్టులు, బ్యాగులపై కూడా జగన్ ఫొటో వేసుకున్నారని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకే తాము అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. తమ విద్యాశాఖ అధికారులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించారని, మహారాష్ట్ర అనుసరిస్తున్న విధానం వల్ల పుస్తకాల బరువు బాగా తగ్గుతోందన్నారు. రాష్ట్రంలో ఇదే పద్ధతిని అమలు చేస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Next Story