- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026 నాటికి వెలిగొండ పూర్తి.. మంత్రి నిమ్మల దీమా
వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులో వస్తోంది. ..

దిశ, వెబ్ డెస్క్: వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులో వస్తోంది. నూతన సంవత్సరంలో జాతికి అంకితం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు పనుల్లో వేగం పెంచింది. వెలిగొండ పనుల పురోగతిపై ప్రాజెక్ట్ అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి 2026 నాటికి నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 2026 జూన్ నాటికి లైనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీజన్ మొదలయ్యే నాటికి పనులన్నీ పూర్తి చేయాలని,2026 జూన్ నాటికి టన్నెల్-2లో మిగిలిన లైనింగ్ పనులు పూర్తి చేయాలని అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్దంగా పనులు చేయాలని ఆదేశించారు.
టన్నెల్-2లో 7 కి.మీ లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 3.2 కి.మీ లైనింగ్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన 3.6 కి.మీ లైనింగ్ పనులు 2026 జూన్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. మెంధా తుఫాన్ కారణంగా టన్నెల్స్ లోకి నీరు వచ్చి చేరడంతో నవంబర్ నెలలో లైనింగ్ పనులు నెమ్మదించాయని అన్నారు. డీవాటరింగ్ తరువాత పనులు మొదలుపెట్టాక డిసెంబర్ నెలలో నిర్దేశించిన 456 మీటర్ల లక్ష్యానికి గానూ, ఇప్పటి వరకు 432 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం నాలుగు గ్యాంట్రీ క్రేన్ లతో టన్నెల్-2 లైనింగ్ పనులు జరుగుతుండగా, వెంటనే మరో గ్యాంట్రీ క్రేన్ కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తద్వారా లైనింగ్ పనులు నిర్దేశించుకున్న లక్ష్యానికి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు.
టన్నెల్-2లో చిక్కుకొన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగించడానికి ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది అన్నారు. ఆ నివేదిక ప్రకారం, టన్నెల్-2 లో ఉన్న టిబిఎం ను తొలగించడానికి చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వెంటనే మొదలుపెట్టి, సీజన్ ముగిసేలోగా పూర్తి చేయాలని అధికారులకు,ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశారు. ఈసీజన్ లోనే వెలిగొండకు నీళ్ళు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని, ఆయన ఆదేశాల మేరకు 2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షణ చేస్తానని స్పష్టం చేశారు.






