ఏపీలో ప్రత్యేక సర్వే.. 12 ప్రశ్నలు అడగనున్న అధికారులు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో పేదరికాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది....

ఏపీలో ప్రత్యేక సర్వే.. 12 ప్రశ్నలు అడగనున్న అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పేదరికాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ‘‘పీ4’’ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వారిని అదుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రభుత్వం కొంత విజయాన్ని సాధించింది. ఇప్పుడు పూర్తిగా సత్ఫలితాన్ని పొందేందుకు ‘‘ప్రత్యేక సర్వే’’ కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. అసలు ఎంత మంది పేదలు ఉన్నారనే అంశంపై ఫోకస్ పెట్టింది. 12 ప్రశ్నలతో సర్వే చేసేందుకు సిద్ధమైంది. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఈ సర్వే చేయనుంది. కుటుంబంలో ఎంత మంది ఉన్నారని, ఇతర ప్రాంతాల్లో ఎవరున్నారు అనే అంశంపై ఆరా తీయనున్నారు. ఆస్తులు ఎన్ని, ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్ ఎన్ని అందుతున్నాయనే అంశాన్ని తెలుసుకోనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లడం లేదా.. కుటుంబ సభ్యుడుకి ఫోన్ చేసి టూ వీలర్, భూమి ఉన్నాయా? అనే సర్వే చేయనున్నారు. ఇలా రాష్ట్రంలో ఎంత మంది పేదలున్నారు..వారిని ఎలా ఆర్థికంగా ఆదుకోవాలనే అంశంపై సర్వే అనంతరం ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.

Next Story