వెంకన్న భక్తులకు తీపికబురు... ఇకపై అన్ని టీటీడీ ఆలయాల్లో ఉచితంగా అన్నప్రసాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-19 17:19:45  IST  )

దేశంలోని అన్ని టీటీడీ ఆలయాల్లో శ్రీవారి భక్తులకు రెండు పూటలు అన్న ప్రసాదాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది...

వెంకన్న భక్తులకు తీపికబురు... ఇకపై అన్ని టీటీడీ ఆలయాల్లో ఉచితంగా అన్నప్రసాదం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) తీపికబురు అందించారు. దేశంలోని అన్ని టీటీడీ ఆలయాల్లో(Temple) భక్తుల(Devotees)కు ఉచితంగా అన్న ప్రసాదం(Anna prasadam) అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ తిరుమలలోనే అమలవుతున్న ఈ స్కీమ్‌ను దేశమంతా విస్తరించాలని భావించింది. ఈ మేరకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆయా టీటీడీ ఆలయాల్లోనే రెండు పూటలు అన్న ప్రసాదం వితరణ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ చారిత్రక నిర్ణయాన్ని స్వయంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతి పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మార్చి నెలాఖరు నుంచే అన్ని టీటీడీ ఆలయాల్లో ఉచిత అన్నప్రసాదం స్కీమ్‌ను అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు అధికారులకు సూచించారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో టీటీడీకి కేటాయించిన స్థలాల్లో ఆలయాల నిర్మాణ పనులను సైతం ప్రారంభించాలని అధికారులకు ఈవో సింఘాల్ తెలిపారు.

Next Story