- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతి పనులపై ప్రభుత్వం దూకుడు.. సీఆర్డీఏ ఆధ్వర్యంలో కీలక సమావేశం
by Vemula.Srinu Prasad |
ఏపీ రాజధాని అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని (Ap Capital) అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది. అమరావతి(Amaravati) పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లను పిలిపించింది. పలు సంస్థలకు పనుల నిర్వహణను కూడా అప్పగించింది. త్వరలో పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రూ. 40 వేల కోట్ల విలువ చేసే పనులను మరికొద్దిరోజుల్లో ప్రారంభించనున్నారు. టెండర్లలో పనుల నిర్వహణను దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సీర్డీఏ(CRDA) ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) మంగళవారం అమరావతితో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ(Minister Narayana)తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని నిర్మాణ పనుల ప్రారంభ తేదీపై చర్చిస్తున్నారు. అనంతరం పనులు తేదీపై స్పష్టం ఇవ్వనున్నారు.
Next Story






