- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ నుంచి వారణాసి, శ్రీలంక, దుబాయ్‌కు ప్రత్యేక విమానాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ పోర్టుల అభివృద్ధి, కొత్త విమాన సర్వీసులపై ప్రభుత్వం దృష్టి సారించింది....

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఎయిర్ పోర్టుల అభివృద్ధి, కొత్త విమాన సర్వీసులపై ప్రభుత్వం దృష్టి సారించింది. గన్నవరం ఎయిర్ పోర్టు(Gannavaram Airport) నుంచి విమాన రాకపోకలు పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రం నుంచి మరిన్ని దేశాలకు విమానాలు నడిపేందుకు కేంద్రం ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఈ రోజు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎంపీలు బాలశౌరి(Mp Balasouri), కేశినేని శివనాథ్(Kesineni Sivanath), ఎయిర్ పోర్టు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ 2028 నాటికి విజయవాడ(Vijayawada) నుంచి దేశ, విదేశాలకు విమానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారణాసి, శ్రీలంక, దుబాయ్‌కు ప్రత్యేక విమానాలను సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విజయవాడ నుంచి సింగపూర్, థాయ్ లాండ్ కు నేరుగా వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ నుంచి నేరుగా అమెరాకాకు విమాన సర్వీసు కోసం సీఎం చంద్రబాబు నాయుడు కోరామని చెప్పారు. కొత్త టెర్నినల్ భవనం 70 శాతం పూర్తియిందన్నారు. మరో నాలుగు నెలల్లో టెర్మినల్ భవనం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వివిధ ప్రదేశాలకు కొత్త విమాన సర్వీసులు వస్తున్నాయన్నారు.రాష్ట్ర సంప్రదాయలు ఉట్టిపడేలా ఎయిర్ పోర్టు డిజైన్ ఉంటుందని కేశినేని శివనాథ్ తెలిపారు.






