- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజన ప్రాంత ఆస్పత్రులకు గుడ్ న్యూస్... డ్రోన్ల ద్వారా మందుల సప్లై
గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను ప్రభుత్వం చేరువచేస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: గిరిజన ప్రాంతాలకు ప్రభుత్వం అత్యవసర వైద్య సేవలను చేరువ చేస్తోంది. ఇందులో భాగంగా గిరిజన ప్రాంత ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారా మందులు, బ్లడ్ యూనిట్స్ పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు "రెడ్ వింగ్" సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా దూరప్రాంతాల్లోని ఆసుపత్రులకు మందులు, బ్లడ్ యూనిట్స్ పంపేందుకు వీలుగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో ఈ సేవలను విశాఖ కేజీహెచ్ నుంచి పాడేరుకు కూడా విస్తరింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో విజయవంతంగా సేవలు అందిస్తున్న సదరు సంస్థ, రాష్ట్రంలో 'ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్' కింద మొదటి 6, 7 నెలల పాటు ఉచితంగా సేవలు అందించడానికి అంగీకరించింది.
పాడేరు కేంద్రంగా కార్యకలాపాలు....
పాడేరును ప్రధాన కేంద్రం (హబ్)గా చేసుకుని, 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ సేవలు అందుతాయి. ఈ డ్రోన్లలో మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం కూడా ఉంటుంది. ఒక్కో డ్రోన్ సుమారు 2 కిలోల బరువును మోసుకెళ్ళే సామర్థ్యంతో పని చేస్తుంది. ఈ డ్రోన్లు కేవలం మందులు తీసుకెళ్లడమే కాకుండా, తిరిగి వచ్చేటప్పుడు రోగుల నుంచి సేకరించిన రక్త, మల, మూత్ర నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు తీసుకొస్తాయి. వచ్చే నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు.






