ప్రభుత్వం మరో నిర్ణయం.. 847 పీఐసీ కమిటీల నియామకం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-10 13:59:31  IST  )

రాష్ట్రంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది..

ప్రభుత్వం మరో నిర్ణయం.. 847 పీఐసీ కమిటీల నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 847 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల(Primary Agricultural Cooperative Societies)కు పీఐసీ కమిటీ(PIC Committee)లను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కమిటీల సభ్యులు 2026 జనవరి 30 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఈ నియామకాలతో సహకార సంఘాల్లో పీఐసీ సభ్యులు తాత్కాలికంగా సేవలందించనున్నారు. ఎన్నికలు జరిగే వరకు లేదా కొత్త పాలక మండలి ఏర్పడే వరకూ పని చేయనున్నారు. చాలా ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల్లో ఎన్నికలు జరగలేదు. దీంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు పర్సన్ ఇన్‌ఛార్జిలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Next Story