- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వినియోగంలోకి రుషికొండ భవనాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
by Vemula.Srinu Prasad |
రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది..

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో విశాఖ రుషికొండ(Visakha)లో భవంతులు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లు నిరూపయోగంగా ఉన్న ఈ భవనాలను వినియోగించేందుకు ప్రభుత్వం(Government) చర్యలు చేపడుతోంది. అయితే వినియోగ మార్గాలపై ప్రజాభిప్రాయంతో పాటు సలహాలను స్వీకరించాలని నిర్ణయిచింది. ఈ మేరకు ప్రజల సలహాలు కోరింది. రుషికొండలో పర్యావరణ, పర్యాటక అభివృద్ధికి పర్యాటకశాఖ ప్రజల సూచనలు కోరింది. ఈనెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థల(National and international organizations)తో టూరిజంశాఖ భేటీ అవుతోంది. రుషికొండ భవనాల(Rushikonda Buildings) వినియోగంపై సంస్థలు సలహాలు ఇవ్వొచ్చని తెలిపింది. మంత్రుల బృందం సమీక్ష తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని టూరిజంశాఖ అథారిటీ సీఈవో ఆమ్రాపాలి పేర్కొన్నారు.
Next Story






