- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదలకు ఇల్లు, స్థలాలు.. హక్కుల విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రభుత్వం
రాష్ట్రంలో పేదలకు ఇచ్చే ఇల్లు, స్థలాల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పేదలకు ఇల్లు, స్థలాలు(House, Places) ఇవ్వాలని ప్రభుత్వం(Government) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇల్లు, స్థలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిబంధనను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇల్లు, స్థలాలు మంజూరు చేసి హక్కులు మాత్రం పదేళ్ల తర్వాత కల్పించేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున మహిళల పేరుతో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పేదలు ఒకసారి మాత్రమే ప్రభుత్వ ఇల్లు, స్థలం పొందేలా అర్హత కల్పించింది. అంతేకాదు ఈ స్థలాల్లో రెండేళ్లలో నిర్మాణం చేపట్టేలా నిర్ణయించింది. అలాగే ఈ ఫ్లాట్‌ను ఆధార్, రేషన్ కార్డుల(Aadhaar, Ration Cards)కు అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇల్లు, స్థలాల విషయంలో ప్రభుత్వ నిబంధనలను ప్రకటించింది.






