ఆచార్య నాగార్జున వర్సిటీలో బీఎడ్ పేపర్‌ లీక్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-07 13:15:25  IST  )

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఎడ్ పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది...

ఆచార్య నాగార్జున వర్సిటీలో బీఎడ్ పేపర్‌ లీక్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Acharya Nagarjuna University)లో బీఎడ్ పరీక్షలు(BEd Exams) జరుగుతున్నాయి. అయితే పేపర్‌ లీక్‌(Bed Exams) అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) స్పందించారు. పేపర్‌ లీక్‌ అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పారు. వెంటనే విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించామని లోకేశ్ తెలిపారు. అంతేకాదు పరీక్ష రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావొద్దని విద్యాశాఖ(Education Department)అధికారులకు నారా లోకేశ్ ఆదేశించారు.

Next Story