భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మొబైల్ యాప్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-17 10:49:58  IST  )

రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మొబైల్ యాప్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో ఆర్జిత టికెట్లు, వసతి గదుల బుకింగ్ కోసం భక్తుల ఇబ్బందులకు చెక్ పెడుతూ ఏపీ టెంపుల్స్ యాప్‌(Ap Temples App)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఈ యాప్ ద్వారా ప్రసాదం సైతం పొందవచ్చని, అలాగే కానుకలు, విరాళాలు సైం ఇవ్వొచ్చని తెలిపింది. ఈ మేరకు మొబైల్ యాప్‌ ద్వారా దర్శన సదుపాయాన్ని దేవాదాయ శాఖ(Endowment Department) కల్పిస్తోంది. తిరుమల(Tirumala), శ్రీశైలం(Srisalam) వంటి ప్రముఖ ఆలయాల్లో దర్శనాల కోసం భక్తులు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు(Srisailam Temple EO Srinivasa Rao) తెలిపారు.

Next Story