నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: నేపాల్‌(Nepal)లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ దేశంలో సోషల్ మీడియాను నిషేధించడంతో ఆందోళనలు ఆకాశాన్నంటాయి. యువకులు రోడ్లపైకి నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తి వేశామని చెప్పింది. అయినా సరే యువత విరుచుకుపడింది. దీంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిని అదుపులో చేసేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది. దేశంలో చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు. అయినా యువత వెనక్కి తగ్గలేదు. దీంతో వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ పరిణామాలతో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.

అయితే ఆ దేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు చిక్కుకుపోయారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారందరిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్టు ఓపెన్ అయిన వెంటనే రాష్ట్ర ప్రజలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేసింది.

నేపాల్‌లో 200 మందికి పైగానే రాష్ట్ర పౌరులు చిక్కుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వారందరిని రాష్ట్రానికి తరలించేందుకు భారత రాయబారి, డీజీసీతో సంప్రదింపులు జరిపింది. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారితో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.

మరోవైపు ఢిల్లీ ఏపీ భవన్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఏపీ భవన్ నెంబర్లు 9818395787,8500027678 కాగా ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ నెంబర్ 0863 2340678. ఈ రెండు నెంబర్లతో పాటు ఈమెయిల్ ఐడీలు [email protected], [email protected]ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Next Story