- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపానుతో ఏపీకి భారీగా నష్టం.. కేంద్రానికి ప్రభుత్వం నివేదిక
తుపానుతో ఏపీకి జరిగిన భారీగా నష్టంపై కేంద్రానికి ప్రభుత్వం నివేదిక పంపింది...

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావం భారీగా పడిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వాన బీభత్సంతో ప్రజలు, పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వం తుపాను నష్టాన్ని అంచనా వేసింది. మొత్తం రూ.5,244 కోట్ల మేర నష్టం జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరకు కేంద్రానికి ప్రభుత్వం నివేదిక పంపింది. తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించాలని కోరింది. నష్టం వివరాలు కూడా పొందుపర్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 249 మండలాల్లో 1434 గ్రామాలు, 48 పట్టణాల్లో తుపాను నష్టం జరిగినట్లు నివేదికలో ప్రభుత్వం తెలిపింది. అలాగే 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు స్పష్టం చేసింది. 4,794 కిలో మీటర్ల మేర రోడ్లు, 311 కల్వర్టులు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇదే విషయాన్ని నివేదికలో తెలిపింది. మొత్తం 1.38 లక్షల హెక్టార్లలో పంట, 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని వెల్లడించింది. రైతులకు రూ.829 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 2,817 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని, పరిశీలన కోసం రాష్ట్రానికి తమ బృందాన్ని పంపాలని నివేదికలో కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం వివరించింది.






