రైల్వే శాఖకు వాసుదేవరెడ్డి రిలీవ్.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

by Vemula.Srinu Prasad |

రైల్వే శాఖకు వాసుదేవరెడ్డి‌ని ప్రభుత్వం రిలీవ్ చేసింది..

రైల్వే శాఖకు వాసుదేవరెడ్డి రిలీవ్.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్‌ స్కాం(AP Liquor Scam)లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాసుదేవరెడ్డి(Vasudeva Reddy)ని ప్రభుత్వం రిలీవ్ చేసింది. అంతేకాదు రైల్వే శాఖ(Railways Department)కు పంపింది. 2019 ఆగస్టులో ఆయన డిప్యుటేషన్‌(Deputation)పై రాష్ట్రానికి వచ్చారు. గత ఏడాది ఆగస్టు 25తో ఆయన డిప్యుటేషన్ ముగిసింది. మద్యం కుంభకోణంలో అవకతవకల ఆరోపణలు రావడంతో వాసుదేవరెడ్డి డిప్యుటేషన్‌ను ఏడాది పొడిగించాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది. దీంతో ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 వరకు డిప్యుటేషన్ పొడిగించింది. అయితే డిప్యుటేషన్ ముగియడంతో తిరిగి వాసుదేవరెడ్డి రైల్వేకు పంపింది.

Next Story