- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరికొత్త చరిత్రకు శ్రీకారం.. పది నిమిషాల్లో పని ఫినిష్
ఏపీలో వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం(Sub-Registrars Office)లో 10 నిమిషాల్లో పని పూర్తయ్యే కొత్త ప్రాజెక్టును ప్రజల ముందుకు తీసుకొచ్చింది. గతంలో మాదిరి గంటలు గంటలు కాకుండా వచ్చిన మనిషి హ్యాపీగా ఫీలయ్యేలా కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు( Pilot Project)గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీలో స్థలాలు క్రయ, విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. 10 నిమిషాల్లోనే రిజస్ట్రేషన్ చేయడంతో పాటు కొనుగోలుదారుడికి పత్రాలు కూడా అందించేలా పైలట్ ప్రాజెక్టును లాంచ్ చేసింది.
విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ప్రాజెక్టును అధికారులు ప్రారంభించారు. 10 నిమిషాల్లోనే మూడు డాక్యుమెంట్స్‌ను రిజిస్ట్రర్ చేసి మొదటి 60 నిమిషాల్లో ముగ్గురు వినియోగదారులకు అందజేశారు. అలాగే డాక్యుమెంట్స్ స్కాన్ కాపీని వాట్సాప్ ద్వారా పంపారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అవడంతో కస్టమర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఇళ్లు, స్థలాలు క్రయ, విక్రయాల కోసం కాళ్లు అరిగేలా తిరాగాల్సిన పని లేదని అన్నారు. అయితే కస్టమర్స్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ అధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.






