- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీలకు మహర్దశ.. ఈ రోజు నుంచే ప్రారంభం
శ్రీసత్యసాయి జిల్లా కదిరి, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీల గ్రేడ్‌ను పెంచూతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(Goverment) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు మున్సిపాలటీల గ్రేడ్‌లను పెంచింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) కదిరి(Kadiri)తో పాటు తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) కొవ్వూరు మున్సిపాలిటీ(Kovvur Municipality)లను హోదాను పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. స్పెషల్ గ్రేడ్‌లో ఉన్న కదిరి మున్సిపాలిటీ హోదాను సెలక్షన్ గ్రేడ్‌కు పెంపు చేసింది.
గ్రేడ్ -3 నుంచి గ్రేడ్-1కు పెంపు
అలాగే కొవ్వూరు మున్సిపాలిటీ హోదా గ్రేడ్ -3 నుంచి గ్రేడ్-1కు ప్రభుత్వం పెంచింది. గడిచిన రెండేళ్లలో ఈ రెండు మున్సిపాలిటీల ఆదాయం, వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు కదిరి, కొవ్వూరు మున్సిపాలిటీల గ్రేడ్‌లను పెంచాలని ఫిక్స్ అయింది. ఈ మేరకు గ్రేడ్‌లను పెంచింది. అంతేకాదు బుధవారం నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు మున్సిపల్ అర్బన్ డెవలప్ మెంట్ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.






