Ap News: గ్రేట్ జాబ్.. రఘురామకు కేబినెట్ హోదా

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-12-06 10:02:50  IST  )

రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామరామకృష్ణంరాజుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కల్పించింది..

Ap News: గ్రేట్ జాబ్.. రఘురామకు కేబినెట్ హోదా
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామరామకృష్ణంరాజు(Deputy Speaker Rama Ramakrishnan Raju)కు కేబినెట్ హోదా(Cabinet status) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కల్పించింది. ఇటీవల ఆయన డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీని సమర్థవంతంగా నడిపించగలిగారని పలువురు నేతలు ప్రశ్నంసలు కురిపించారు. తాజాగా పదవిలో ఉన్నంత వరకూ రఘురామకు కేబినెట్ హోదా కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ పొలిటికల్ సెక్రటరీ సురేశ్ కుమార్ ఉత్తర్వుల జారీ చేశారు.

కాగా 2019 ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు వైసీపీ(Ycp) తరపున నర్సాపురంలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీకి దూరం జరగారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు. ఆయనపై కేసులు నమోదు చేయించి కస్టోడియల్ టార్చెర్‌(Custodial torture)కు పాల్పడ్డారు. ఈ కేసును సైతం నీరుగార్చే ప్రయత్నం చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రఘురామ విజయం సాధించారు. ఆరు నెలల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను టార్చెర్ కేసుపై ప్రస్తుతం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. దీంతో ఆయనకు తాజాగా కేబినెట్ హోదా లభించింది.

Next Story