కేజీబీవీ స్కూల్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.1000 జమ

by Vemula.Srinu Prasad |

ఏపీలో కేజీబీవీ స్కూల్‌ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

కేజీబీవీ స్కూల్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.1000 జమ
X

దిశ, వెబ్ డెస్క్: చదువులో నిరంతర ప్రోత్సాహం, సులభమైన విద్యావిధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థినుల విద్య కొనసాగింపు, ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఇందులో భాగంగా కేజీబీవీ (Kasturba Gandhi Balika Vidyalaya) స్కూల్‌ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. బాలికల స్కాలర్‌షిప్‌లకు రూ.10.70 కోట్ల నిధులను విడుదల చేసింది. 2025-26 వార్షిక సంవత్సరానికి గాను ప్రతి విద్యార్థిని స్కాలర్ షిప్ ఖాతాలో రూ.1000 జమ చేసింది. కేజీబీవీ స్కూళ్లలో మొత్తం 1.07 లక్షల మంది బాలికలు చదువుతున్నారు. నిధుల విడుదలతో వారందరికీ ప్రత్యక్ష లాభం కలగనుంది.

Next Story