- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్.. వరద నివారణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతిప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వరద నివారణపై కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో వరద నివారణ(Flood prevention)కు కొత్త పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తెలిపారు. అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో నిర్వహించిన 56వ సీఆర్డీఏ అథారిటీ(56th CRDA Authority) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జరీబ్-నాన్ జరీబ్ భూసమస్యలు(Zarib-Non-Zarib Land Issues) పరిష్కారానికి కమిటీని నియమిస్తామని తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అలాగే త్వరితగతిన భూమిని గుర్తించాలని అధికారులకు సూచినట్లు చంద్రబాబు తెలిపారు.
‘రాజధాని ప్రాంతంలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అమరావతిలో ఇప్పటికే ఓ వేదికను నిర్మించి ఉంటే బాగుండేది. దీని కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించండి. ఏర్పాటు చేయబోయే కల్చరల్ సెంటర్‌కు ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించండి. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా కల్చరల్ సెంటర్ నిర్మాణం చేపట్టాలి. నిర్దేశిత గడువులోగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలి. భూములిచ్చిన రైతులకు కేటాయించే ప్లాట్లకు లే అవుట్ల వద్ద పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి. రాజధాని రైతుల సమస్యలపై జాప్యం లేకుండా పరిష్కరించాలి. రాజధాని పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అటవీ సంపద, నదీ పరివాహకం, కొండలు వంటివి అమరావతికి ప్రకృతి శోభను తీసుకొస్తాయి. వివిధ రకాల పూల మొక్కలను రాజధాని ప్రాంతంలో నాటి పర్యాటకులను... ప్రకృతి ప్రేమికులను ఆకర్షించాలి. అదే విధంగా పార్కులను ఏర్పాటు చేయాలి. అమరావతికి వచ్చే వారికి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో హోటళ్లు ఉండేలా చూడాలి. ఈ మేరకు వాటి నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.






