- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూమిలేని పేదలకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5 వేల పెన్షన్..?
అమరావతిలో భూమిలేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతి(Capital Amaravati)లో భూమిలేని పేదల(Landless poor)కు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 4,929 మందికి భూమిలేదని గుర్తించింది. వీరందరికీ పెన్షన్ ఇచ్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందుకోసం త్రిసభ్యకమిటీని నియమించింది. గత ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్లపైనా ఈ కమిటీ పునరాలోచన చేసింది. వీరికి సైతం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులకు సీఆర్డీఏ సైతం ఆమోదం తెలిపింది. అర్హులైన వారికి నెలకు రూ. 5 వేలు పెన్షన్ ఇచ్చే యోచన చేసింది. గ్రామ సభల సమయంలో అర్జీలు సమర్పించవచ్చని సీఆర్డీఏ స్పష్టం చేసింది. భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని CRDA హామీ ఇచ్చింది.
కాగా 2014-19 సమయంలో టీడీపీ(Tdp) ప్రభుత్వం అమరావతి రాజధానిలో భూమి లేని 1575 మంది పేదలకు పెన్షన్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు పెన్షన్ మంజూరు చేసింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పింఛన్లను రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పునరుద్ధరణ చేసింది. తాజాగా మరోసారి సర్వే చేసింది. మొత్తం 4929 మందికి భూమి లేదని గుర్తించింది. ఈ కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఇందులో భాగంగా తాజాగా ప్రకటన విడుదల చేశారు.






