పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ

by Vemula.Srinu Prasad |

ఏపీలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలో జరగబోయే పరీక్షలకు తాజాగా హాల్ టికెట్ల విడుదల అయిన నేపథ్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో పదో తరగతి పరీక్ష(Tenth Exams) రాస్తున్న విద్యార్థుల(Students)కు ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలో జరగబోయే పరీక్షలకు తాజాగా హాల్ టికెట్ల విడుదల అయిన నేపథ్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షా కేంద్రానికి వెళ్తే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ సౌకర్యం పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులో కల్పిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ వరకూ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఫ్రీ జర్నీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6 లక్షల 42 వేల మంది విద్యార్థులు రాయబోతున్నారని, వీరందరిని ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వం సూచించింది. పరీక్ష జరిగే రోజుల్లో ఆయా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీని, సిబ్బందిని ఆదేశించింది.

కాగా వాట్సప్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించింది. మన మిత్ర వాట్సప్ నెం 9552300009 ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చవని అధికారులు ప్రకటించారు. ‘H’ అని టైప్ చేసి హాల్ టికెట్లు తీసుకోచ్చని తెలిపారు. బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ లేదా మన మిత్ర వాట్సప్ నెంబర్, స్కూలు విద్యాశాఖ లీప్ యాప్ ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Next Story