రైతులకు గుడ్ న్యూస్... మూడు పంటల కొనుగోళ్లపై కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

మామిడి, పొగాకు, కోకో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

రైతులకు గుడ్ న్యూస్... మూడు పంటల కొనుగోళ్లపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: మామిడి(Mamidi), పొగాకు(tobacco), కోకో రైతుల(CoCo Farmers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పొగాకు కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని ప్రకటించింది. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ శాఖ అధికారులతో అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు(Minister Achennaidu) పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు నల్లబెల్లి పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని సూచించారు. మామిడి పంటలను కొనుగోలుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోకో విషయంలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చేస్తామని మంత్రి అచ్చెన్న హామీ ఇచ్చారు.

Next Story