ఆక్వా కల్చర్‌కు తీపికబురు.. రూ. 1.50కే యూనిట్ విద్యుత్

by Vemula.Srinu Prasad |

ఆక్వా కల్చర్‌కు ప్రభుత్వం తీపికబురు అందించింది....

ఆక్వా కల్చర్‌కు తీపికబురు.. రూ. 1.50కే యూనిట్ విద్యుత్
X

దిశ, వెబ్ డెస్క్: ఆక్వా కల్చర్‌(Aquaculture)కు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఏపీ(Ap)లో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ ఉందని, రూ. 1.50కే యూనిట్ విద్యుత్(unit of electricity) ఇవ్వాలని నిర్ణయించింది. రాయితీ విద్యుత్ అందించేందుకు జోన్-నాన్ జోన్ కింద విభజించినట్లు స్పష్టం చేసింది. నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రూ. 1.50కు యూనిట్ విద్యుత్ అందివ్వాలని అధికారులను ఆదేశించింది. ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబులిటీ, సర్టిఫికేషన్ కంపల్సరీ చేసింది. ఆక్వా కల్చరును ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పౌల్ట్రీ వేస్ట్ ఇష్టానుసారంగా పడేయకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story