- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాల్వబుగ్గకు భారీగా నిధులు.. మంత్రి కీలక ప్రకటన
కాల్వబుగ్గ రామేశ్వరం ఆలయంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ రామేశ్వరం ఆలయం(Kalvabugga Rameswaram Temple)పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆలయం అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Minister Anam Ramanarayana Reddy) క్లారిటీ ఇచ్చారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం దుర్వేసి గ్రామంలో సూపరిపాలనలో తొలి అడుగు(Suparipalanalo Tholi Adugu) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లాలో47 ఆలయాలకు రూ. 43 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాల్వబుగ్గ రామేశ్వరం ఆలయానికి రూ. 4 కోట్లు ప్రభుత్వం మంజూరు చేశామన్నారు. ఆలయాల్లో ధూపదీపనైవేద్యాలకు పూజారికి ప్రతినెల పది వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. తప్పుడు హామీలు ఇవ్వమని చెప్పారు. మాట ఇస్తే సీఎం చంద్రబాబు నాయుడు తప్పే రకం కాదన్నారు.
‘‘ఆడబిడ్డలకు పెళ్ళి, ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం అడబిడ్డ నిధితో అండగా ఉంటుంది. అడబిడ్డ నిధిని కూడా త్వరలో ప్రారంభిస్తాం. ఆగస్టు15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. దుర్వేసి గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామంలో సుంకులమ్మ గుడి నిర్మిస్తాం.’’ అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.






