విశాఖ స్టీల్‌పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం, పరిరక్షణపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది....

విశాఖ స్టీల్‌పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) బలోపేతం, పరిరక్షణపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా ప్లాంట్‌కు సహాయసహకారాలు అందించింది. దీంతో ప్లాంట్‌లో ఉత్పత్తి ఊపందుకుంది. గతం కంటే భారీ స్థాయిలో ఉత్పత్తి జరుగుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి, పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. ప్లాంట్‌ని నష్టాల నుంచి బయటపడేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సి ఉందని చెప్పారు. గత ఏడాది కాలంలో తీసుకున్న చర్యలు, సమిష్టి నిర్ణయాలు, సమన్వయం కారణంగా ప్లాంట్ మంచి ఫలితాలు సాధిస్తోందని చంద్రబాబు తెలిపారు

గత ఏడాది సెప్టెంబర్‌లో ప్లాంట్ సామర్థ్యంలో 25 శాతం మాత్రమే ఉత్పత్తి జరగ్గా.... ఈ సెప్టెంబర్‌లో అది 79 శాతానికి చేరిందని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు. మూడవ త్రైమాసికం ముగిసేలోగా 92.5 శాతం ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని సిఎం సూచించారు. ప్లాంట్ పని తీరు, పురోగతిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేస్తామన్నారు. ప్రతినెలా సీఎస్ స్థాయిలో ప్లాంట్‌పై రివ్యూ చేయాలని ప్లాంట్ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

Next Story