- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధ్యాయ సంఘాలతో కీలక చర్చలు.. పలు డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు దిగింది....

దిశ, వెబ్ డెస్క్: ఉపాధ్యాయ సంఘాలు(Teachers unions) ఉద్యమానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం(Government) చర్చలకు దిగింది. ఉపాధ్యాయుల సమస్యలు, కొత్త విద్యా విధానం, అభ్యంతరాలపై చర్చించింది. దీంతో 15 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉపాధ్యాయ సంఘాలు ఉంచాయి. టీచర్ల బదిలీలు, 9 రకాల స్కూళ్లు, ఇంగ్లీష్ మీడియంపైనా చర్చించింది. ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాల్లో పలు మార్పులు తీసుకురావాలని ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు సూచించాయి. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక(Teachers Unions Ikya vedhika)తో విద్యాశాఖ కమిషనర్ చర్చలు కొనసాగుతున్నాయి.
అయితే ఉపాధ్యాయ సంఘాలు చేసిన పలు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. మూడు కీలక డిమాండ్లపై మాత్రం చర్చలు కొనసాగుతున్నాయి. ఫౌండేషన్ స్కూల్స్ రద్దుపై ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. మంత్రి నారా లోకేశ్(Minister Lokesh)తో సమావేశం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక కోరాయి. ప్రస్తుతానికి మూడు డిమాండ్లపై మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.






