Good News: పాస్టర్ల ఖాతాల్లో భారీగా నగదు జమ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-19 13:58:27  IST  )

పాస్టర్లకు ఇస్తామన్న గౌరవవేతనాన్ని ప్రభుత్వం ఇవాళ వాళ్ల ఖాతాల్లో జమ చేసింది...

Good News: పాస్టర్ల ఖాతాల్లో భారీగా నగదు జమ
X

దిశ, వెబ్ డెస్క్: పాస్టర్ల(Pastors)కు ఇస్తామన్న గౌరవవేతనాన్ని ప్రభుత్వం ఇవాళ వాళ్ల ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,427 మంది అర్హులైన పాస్టర్లను గుర్తించి నెలకు రూ. 5 వేల చొప్పున వేతనాలు ఇచ్చింది. మేరకు నిధులు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం(Coalition Government) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కో పాస్టర్‌కు ఏడు నెలల గౌరవ వేతనం ఒకేసారి అందింది. మొత్తం ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.35 వేలు జమ అయింది. దీంతో పాస్టర్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కృషిని గుర్తించి ప్రభుత్వం తమకు గౌరవ వేతనం ఇవ్వడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

కాగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో లోకేశ్‌ను పాస్టర్లు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన తాము అధికారంలోకి వస్తే ప్రతి నెల రూ. 5 వేల గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాస్టర్ల సమస్యలపై మంత్రి లోకేశ్ దృష్టి సారించారు. ఈ మేరకు కృషి చేశారు. దీంతో పాస్టర్లకు ఏడు నెలల వేతనం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు వారి అకౌంట్లలోకి నిధులు జమ చేసింది. దీంతో లోకేశ్ ఎన్నికల హామీ నెరవేరినట్లైంది.

Next Story