- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 5 వేలకే ఈ-సైకిల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
బ్యాంకు లోన్ ద్వారా ప్రజలకు ఈ-సైకిళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్: పర్యావరణం పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం మెరుగు కోసం ఏపీ ప్రభుత్వం(Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 5 వేలకే ఈ-సైకిల్(E-Cycle) అందించాలని భావించింది. ‘‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’’ పథకాల కింద ఈ సైకిళ్లను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సొంత ఇలాక కుప్పంలో మొదటి విడదగా ఈ-సైకిళ్లను అందించాలని నిర్ణయించింది. ఈ సైకిల్ ధర రూ. 23,999 కాగా ముందుగా రూ. 5 వేలు చెల్లించాలని, మిగిలిన డబ్బులు బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించాలని సూచించింది. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఈ-సైకిళ్లను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇక ఈ-సైకిల్స్ కావాలనుకునే వాళ్లు గ్రామ, వార్డు సచివాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఒక యూనిట్ విద్యుత్‌తో 40 కిలో మీటర్లు ప్రయాణించొచ్చని స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు జనవరిలో కుప్పం పర్యటించనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఈ- సైకిళ్లను అందజేయాలని యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ-సైకిల్ వినియోగంతో పెట్రోల్ ఖర్చులు తగ్గించొచ్చని, మరోవైపు శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతోందని, అటు వాయు, శబ్ద కాలుష్యం సైతం తగ్గుతోందని తెలిపింది






