- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Breaking: 500 మంది ఉద్యోగుల తొలగింపు

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగాలంటే వీళ్లవి.. అసలు ఆఫీసులకు వెళ్లరు. పని చేయరు. కానీ జీతం తీసుకుంటారు. ఇదీ గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్‌లో జరిగిన తంతు. 2017లో చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt) ఏపీ ఫైబర్ నెట్(AP Fiber Net)ను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఇంటింటికీ కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్‌ను అతి తక్కువ ధరకే ఇవ్వాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. ఇందులో భాగంగా కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేసింది. 2019 మార్చి నాటికి 17 లక్షల కనెక్షన్లు ఇచ్చింది.
అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ పడకేసింది. ఐదేళ్లలో 17 లక్షల కనెక్షన్లు 5 లక్షలకు దిగిపోయాయి. సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఉద్యోగులు మాత్రం జీతాలు కరెక్ట్‌గా తీసుకున్నారు. కొందరు కార్యాలయాలకు వచ్చి పని చేసి వేతనాలు తీసుకుంటే మరికొందరు మాత్రం వైసీపీ నేతల ఇళ్లలో పని చేస్తూ డబ్బులు తీసుకున్నారు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. సూర్య ఎంటర్ ప్రైజెస్(Surya Enterprises) ద్వారా నియమించిన వారంతా కార్యాలయానికి రాకుండానే జీతాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండబోదని స్పష్టం చేసింది