- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం కీలక నిర్ణయం.. 19 నుంచి పీ4 అమలు
ఈ నెల 19వ తేదీ నుంచి పీ4 అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 19వ తేదీ నుంచి పీ4 కార్యక్రమం(P4 program) అమలు చేయాలని కూటమి ప్రభుత్వం(Coalition Government) నిర్ణయించింది. రాష్ట్రంలో పీ4 కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే పీ4 కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 2029 నాటికి పీ4 లక్ష్యం సాకారం అవుతుందని చెప్పారు. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుందని సీఎం తెలిపారు.
‘‘బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే జరుగుతోంది. ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదు. ఎవరినీ బలవంతం చేయొద్దు. మానవత్వం ఉండే వారే ఇందులో చేరతారు. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి కావచ్చు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు అదనపు సాయం పీ4 ద్వారా అందుతుంది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలను కలిసి వారిలో ఆలోచనను రేకెత్తించండి.’’ అని సీఎం చంద్రబాబు సూచించారు.






