- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర విద్యార్ధులకు భారీ గుడ్ న్యూస్.. పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు
రాష్ట్ర విద్యార్ధులకు పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది...

దిశ, వెబ్ డెస్క్: విద్యార్ధులకు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) గుడ్ న్యూస్ తెలిపారు. ఇప్పటికే పాఠశాల విద్యార్థుల(Students)కు చేయూతగా నిలిచిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కోసం మంచి ఆలోచన చేసింది. విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థికంగా రుణాలు అందజేసి అండగా నిలవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇక రాష్ట్రం నుంచి విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి పరిమితులు లేకుండా, ఎంతమంది విద్యార్ధులకైనా చదువుకునే అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఇందులో 4 శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. అటు బీసీ విద్యార్ధులు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.






