ఏపీ జర్నలిస్టులకు ముఖ్య గమనిక.. అక్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు

by Vemula.Srinu Prasad |

ఏపీ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...

ఏపీ జర్నలిస్టులకు ముఖ్య గమనిక.. అక్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ జర్నలిస్టుల(Ap Journalists) అక్రిడిటేషన్ కార్డుల(Accreditation cards) గడువు ఈ నెల 31తో ముగుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పాటు పొడిగించింది. ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు శ్రీ హిమాన్షు(Shri Himanshu) శుక్ల తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని పాత్రికేయుల అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితి ఆగస్టు 31తో ముగుస్తోందని, సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ వరకు ఈ పొడిగింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. అప్పటివరకూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు.

Next Story