రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్‌పై ప్రభుత్వం సీరియస్.. హోంశాఖకు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-18 11:59:13  IST  )

రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్‌పై ప్రభుత్వం సీరియస్ అయింది.....

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్‌పై ప్రభుత్వం సీరియస్.. హోంశాఖకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా (Nellore District)లో రౌడీ షీటర్ శ్రీకాంత్‌(Rowdy sheeter Srikanth)కు పెరోల్(Parole) రావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇద్దరు ఎస్పీలు నిరాకరించినా ఓ ఎస్పీ చొరవతో వ్యక్తి హత్య కేసులో జైలులో జీవితఖైదుగా ఉన్న రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ రావడం, ఆ తర్వాత ఆయన పలువురిని కలవడంపై అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. శ్రీకాంత్‌కు పెరోల్ ఇచ్చిన వారిపై సీఎంవో ఆరా తీసింది. అలాగే పెరోల్‌పై వచ్చి ఎమ్మెల్యేను కలిసిన అంశంపైనా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో శ్రీకాంత్ చేసిన దందాలపై హోంశాఖను నివేదిక కోరింది.

కాగా రౌడీ షీటర్ శ్రీకాంత్‌‌కు చెందిన రాసలీలలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. జైలులో జీవిత ఖైదుగా ఉన్న శ్రీకాంత్‌ను అనారోగ్యం దృష్ట్యా కొద్ది రోజుల క్రితం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో ఆయనతో ఓ మహిళ చనువుగా ఉన్నారు. ఇద్దరి మధ్య రాసలీలలు జరిగినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులే దగ్గరుండి ఇలా చేయడమేంటనే ప్రశ్నలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో అరుణ అనే మహిళ పేరు తెరపైకి వచ్చింది. శ్రీకాంత్‌కు అరుణ ప్రియురాలని, నెల్లూరు జిల్లాలో ఆమె లేడీ డాన్ అనే విషయాలు బయటకు వచ్చాయి. నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో శ్రీకాంత్, అరుణ దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తారని, యువ రాజకీయ నేతలతోనూ ఆమె టచ్‌లో ఉన్నారనే విషయాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఓ ఎస్పీతో అరుణ గోవా వెళ్లడంతోనే శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చిందంటూ మరో ప్రచారం కూడా జరిగింది. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశించింది.

Also Read: కూకట్‌పల్లిలో బాలిక హత్య కేసులో నమ్మలేని నిజాలు

Next Story