- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: కళారత్న, ఉగాది అవార్డుల ప్రకటన
కళారత్న, ఉగాది అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) ప్రతి ఏడాది ఉగాది(Ugadi)కి కళల్లో అత్యుత్తమ కృషి చేసిన వారికి కళారత్న(Kalarathna), ఉగాది పురస్కారాలు ఇవ్వడం 1999 నుంచి ఆనవాయితీగా వస్తోంది. సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద, గిరిజన కళల్లో చేసిన సేవలకు ప్రభుత్వం, రాష్ట్ర సాంస్కృతిక మండలి సంయుక్తంగా ఈ అవార్డులను అందిస్తున్నాయి.
ఈ పురస్కరాలను ముఖ్యమంత్రి చేతులు మీదుగా అందిస్తారు. రూ.50 వేల నగదుతో పాటు శాలువా, బంగారు పూత పురస్కారం అందిస్తారు. అయితే ఏడాది కూడా 2025 కళారత్న పురస్కారాలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు పురస్కారాలను శనివారం ప్రకటించింది. 86 మందికి కళారత్న అవార్డులు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే 116 మందికి ఉగాది అవార్డులను ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది సందర్భంగా ఆదివారం ఈ అవార్డులను అందించనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.






