- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది....

దిశ, వెబ్ డెస్క్: కొత్త రేషన్ కార్డుల(New ration cards)పై ప్రభుత్వం గుడ్ న్యూస్(Good News) తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చే నెలకు సంవత్సరం అవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు కావాలని చాలా మంది పేదల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. దీంతో రేషన్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ సిద్ధమవుతోంది. కొత్త, పాత రేషన్ కార్డుదారులకు అవసరయ్యే బియ్యం, సరుకులపై అంచనా వేసింది.
ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) దృష్టి సారించారు. తిరుపతి(Tirupati)లో శుక్రవారం పర్యటించిన ఆయన.. రేషన్ కార్డుల మంజూరుపై కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేశారని తెలిపారు. మే నెలలోపు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ నెల నుంచి జులై వరకూ దీపం పథకానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కేవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్(Free Gas Cylinder) లభిస్తుందన్నారు. రూ.2900 కోట్లతో దీపం-2 పథకం ద్వారా ఉచిత సిలిండర్లు అందిస్తామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.






