- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఉచితంగా సివిల్స్ కోచింగ్
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.....

దిశ, వెబ్ డెస్క్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 14 నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇవ్వనుంది. వంద మంది అభ్యర్థులకు శిక్షణిచ్చేలా గొల్లపూడి బీసీ భవన్‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ దరఖాస్తుల స్వీరించనుంది. డిసెబర్ 7న అర్హత పరీక్ష నిర్వహించనుంది. 11న అర్హత పరీక్ష ఉత్తీర్ణత ఫలితాలు ప్రకటించనుంది. 14 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభించనుంది. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు12న గొల్లపూడిలోని బీసీ భవన్‌లో రిపోర్టు చేయాలి. తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన బీసీ అభ్యర్థులు ఉచిత సివిల్స్ శిక్షణకు అర్హులు. గతేడాది ఉచిత శిక్షణ పొందిన వారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించనుంది. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు కల్పించనుంది.
ఎస్సీ, ఎస్టీలకూ అవకాశం....
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందించే ఉచిత సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ శిక్షణకు బీసీ అభ్యర్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకూ అవకాశం కల్పించింది. 100 సీట్లలో బీసీలకు 66 సీట్లు, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 సీట్లు కేటాయించనుంది. మహిళలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేయనుంది.






