- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలతో నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
by Vemula.Srinu Prasad |
భారీ వర్షాలు, ప్రమాదం కారణంగా మృతి చెందిన నలుగురు మృతికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర(Uttarandra)పై వరుణుడు(Rains) విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో శ్రీకాకుళం(Srikakulam), విజయనగరం(Vijayanagaram), విశాఖ(Visakha) జిల్లాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ మేరకు వారికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు.. తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు చంద్రబాబు(Cm Chandrababu)కు అధికారులు తెలిపారు. విశాఖలో ఒకరు, కురుపాంలో మరొకరు, మందసలో ఇద్దరు చనిపోయినట్లు వివరించారు. దీంతో విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు
Next Story






