రాజధానిలో బీజేపీ ఆఫీస్‌కు 2 ఎకరాల భూమి.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-13 13:38:03  IST  )

ఏపీ రాజధానిలో రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.....

రాజధానిలో బీజేపీ ఆఫీస్‌కు 2 ఎకరాల భూమి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(AP Capital)లో రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి(BJP Office) 2 ఎకరాల భూమి(Land)ని ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ కార్యాలయం(Bjp Office)తో పాటు కొత్తగా 7 సంస్థలకూ ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఒక్కొక్క సంస్థకు 32.4 ఎకరాలు 60 ఏళ్ల లీజు ప్రతిపాదికన భూమిని కేటాయించింది. కేబినెట్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపింది. అంబికా(Ambika), గెయిల్(Gail) సంస్థలకు ఇచ్చిన గత కేటాయింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 సంస్థలకు ఇచ్చిన భూములపై సవరణలు చేయడంతో పాటు మళ్లీ కేటాయింపులు చేసినట్లు పేర్కొంది. అలా కొత్తగా 7 సంస్థలకు 32.4 ఎకరాలను కేటాయింపులు జరిపింది. ఈ మేరకు మున్సిపల్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story