రాష్ట్రంలో బెల్టు షాపులు, సారాపై ఉక్కుపాదం.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-03 15:50:04  IST  )

ఏపీలో బెల్డ్ షాపులు, నాటు సారాపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది..

రాష్ట్రంలో బెల్టు షాపులు, సారాపై ఉక్కుపాదం.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బెల్డ్ షాపులు, నాటు సారా(Belt shops, Natu Sara)పై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నాటు సారాను నియంత్రించాల్సిదేనని నిర్ణయించింది. ఇందుకోసం నూతన ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థను తీసుకురావాలనే యోచనలో ఉంది. బెల్ట్ షాపులు, సారా నియంత్రించేందుకు నీరా సొసైటీలు(Neera Societies), తాటి ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.


ఈ మేరకు ఎక్సైజ్ అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుపై ప్రతిపాదనలు రెడీ చేయాలని సూచించారు. అలాగే డీ అడిక్షన్ కేంద్రాలతో పాటు కొత్త బ్రాండ్ల పరిచయం, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు వంటి వాటిపైనా ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 1కల్లా కృష్ణా జిల్లాను నాటు సారా రహితంగా తీర్చిదిద్దాలన్నారు. టెక్కలి, గుడివాడ, రాయచోటిలో మద్యం డిపోలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నీరా ఏర్పాటుపై పొరుగు రాష్ట్రాల్లో అధికారులతో అధ్యయనం చేయిస్తామని తెలిపారు. మైక్రో బ్రేవరీ పాలసీని రెడీ చేయాలన్నారు. ఈ నెల 10న ఉమ్మడి అనంతపురంలో మద్యం డిపోలు ఆవిష్కరణ చేస్తామని కొల్ల రవీంద్ర స్పష్టం చేశారు.

Next Story