- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
విశాఖ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఫ్రీ హోల్డ్ భూముల(Visakha Free hold lands) విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్(Insider Trading) జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆ భూములను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి అనగాని ప్రసాద్(Minister Angani Prasad) తెలిపారు. ఫిబ్రవరిలో మరోసారి విశాఖ(Visakha)లో ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు. ఆర్డీవోలతో నిర్వహించిన ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్‌లో పాల్గొన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూక ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించిన తర్వాతనే రీ సర్వేపై ముందుకు వెళ్తామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈసారి చాలా పకడ్బందీగా రీ సర్వే కొనసాగిస్తామని తెలిపారు. దొర్లిన ప్రతి తప్పును రీ సర్వేలో సరిదిద్దుతామని తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం చేస్తూ రెవెన్యూ రికార్డులన్నింటిని పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నెంబర్ ఆధారంగా రికార్డు తయారు చేసి పెట్టుకోవాలని కలెక్టర్లు, ఆర్డీవోలకు మంత్రి సత్యప్రసాద్ ఆదేశించారు.






