- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ పన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఎన్డీయే కూటమి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2024 డిసెంబర్ 31 నుంచి రద్దు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 2021 నవంబర్‌లో చెత్త పన్ను వసూలు ప్రారంభమైంది. దీన్ని రద్దు చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణ(Municipal Act Amendment)ను అసెంబ్లీ(Assembly) ఆమోదించగా, గవర్నర్(Governor) అనుమతితో ఇటీవల గెజిట్ విడుదలైంది. ఈ క్రమంలో తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.
చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం-1965లో చేర్చిన సెక్షన్ 170-బి, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955లోని సెక్షన్ 491-ఎ ను తొలగిస్తున్నట్లుగా అందులో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూళ్లు చేశారు. చెత్త పన్ను వసూళ్ల పై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను వసూళ్లు నిలిపివేసింది.






