రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా.. అమలు ఎప్పటి నుంచంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-28 08:14:52  IST  )

రాష్ట్ర ప్రజలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది.

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా.. అమలు ఎప్పటి నుంచంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ బడ్జెట్(AP Budget) సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) కీలక ప్రకటన చేశారు. ఈరోజు(శుక్రవారం) బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ఏడాది నుంచి కొత్త పథకం(New Scheme) అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు(Medical services) అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని వెల్లడించారు.

ఈ పథకం ఈ సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందన్నారు. దీనివల్ల మధ్యతరగతి, పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం(Corporate medicine) పొందవచ్చని వివరించారు. అంతేకాదు ఆరోగ్య శాఖకు రూ.19,264 కోట్లు కేటాయించామన్నారు. అయితే ఈ కొత్త పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఎవరెవరు దీనిని పొందటానికి అర్హులనే అంశంపై స్పష్టత రాలేదు. ఏదేమైనా ఈ కొత్త పథకం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తుందనే చెప్పవచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే కూటమి ప్రభుత్వం విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ పథకం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వార్షిక బడ్జెట్‌లో వివిధ రంగాలకు ప్రకటించిన మొత్తాలను పరిశీలిస్తే వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సారి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది.

Next Story